ఆ ఇద్దరికి అక్షింతలేసిన హైకోర్టు
సీఎం రేవంత్ రెడ్డి సర్కారుని …తెలంగాణ హైకోర్టు సున్నితంగా మందలించింది.తెలంగాణలో గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ల రేట్ల పెంపుకు సర్కారు అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా వ్యాజ్యాన్ని కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. బెనిఫిట్ షోలు రద్దు చేసి ప్రత్యేక షోలకు అనుమతి ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించింది.బెనిఫిట్ షోలకు,ప్రత్యేక షోలకు తేడా ఏంటని ప్రశ్నించింది.భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి తమకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరే నిర్మాతల పట్ల ఉదాశీనంగా ఉండొద్దని సూచించింది.దీని వల్ల సగటు ప్రేక్షకుడికి సినీ వినోదం దూరమయ్యే పరిస్థితి నెలకొంటుందని కోర్టు అభిప్రాయపడింది.అర్ధరాత్రిళ్లలో షోలకు అనుమతిచ్చే అంశాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఆదేశించింది.


 
							 
							