Home Page SliderNational

చిన్నారిని కాపాడిన హీరోయిన్ సోదరి

ప్రముఖ హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ పటాని ఓ చిన్నారిని కాపాడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలిలో జరిగింది. ఓ ఇంటి సమీపంలో హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ వాకింగ్ చేస్తుండగా ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లిన ఆమె చిన్నారిని రక్షించింది. చిన్నారిని వదిలి వెళ్లిన వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఖుష్బూ చేసిన పనికి దిశాలో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.