హీరోయిన్ చాలా కసికసిగా ఉంది..
బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓ హీరోయిన్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న మల్లారెడ్డి.. హీరోయిన్ కసికా కపూర్ గురించి మాట్లాడుతూ.. ‘హీరోయిన్ పేరు కసికా కపూర్ అంట… ఆమె చాలా కసికసిగా ఉంది’ అంటూ స్టేజ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాగేనా అనేది? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘తన కూతురు వయసున్న హీరోయిన్ తో ఇలా బిహేవ్ చేస్తారా’.. ‘మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డికి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదా?” అంటూ చురకలు అంటిస్తున్నారు.

