రాంగ్ రూట్‌లో కారు నడుపుతూ హీరో హల్‌చల్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్‌లో కారును నడుపుతూ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్ చల్ చేశాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ చుక్కలు చూపించాడు. రాంగ్ రూట్ లోకి వచ్చి కానిస్టేబుల్‌పైకి దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. బెల్లంకొండని కానిస్టేబుల్ అడ్డుకుని నిలదీయటంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

