Home Page SliderTelangana

కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. కాగా కేసీఆర్ తెలంగాణాలో ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు దీనిపై తాజాగా విచారణ చేపట్టింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహరెడ్డి స్థానంలో కొత్తవారిని నియమించాలని సుప్రీం పేర్కొంది. అయితే దీనికి కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని తెలిపింది. ఈ కమిషన్ జ్యూడీషియల్ కమిషన్‌లా కాకుండా ఎంక్వైరీ కమిషన్‌లా వ్యవహరించాలని సుప్రీం సూచించింది.  అయితే చైర్మన్ పేరును ప్రకటించేందుకు తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టును సమయం కోరినట్లు తెలుస్తోంది.