సరిగ్గా 12 గంటలకే తల పేలిపోయింది
బాణాసంచా కాల్చుతుండగా గన్ షాట్ ఆలస్యంగా పేలి… ఓ వ్యక్తి కళ్లలో నుంచి మెదడులోకి దూసుకెళ్లి మృతి చెందిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖ నగర పరిధి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జీవీఎంసీ 87వ వార్డు ఉక్కు నిర్వాసిత రజక వీధిలో సుద్ధమల శివ.. భార్య ధనలక్ష్మి, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా తన ఇంటి మేడపై కుటుంబంతో శివ ఉత్సాహంగా గడిపారు. అప్పటి వరకూ అంతా సరదాగా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉన్నారు. రాత్రి 12 గంటల సమయంలో కొత్త సంవత్సరం రావడంతో న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.అనంతరం బాణాసంచా కాల్చుతుండగా అవి సక్రమంగా పేలలేదు. నిప్పు అంటుకుందో లేదోనని చూడడానికి వాటి దగ్గరకు వెళ్లాడు. ఇలా వెళ్లి చూడగానే ఒక్కసారిగా పేలి రెండు కళ్లను చీల్చుకుంటూ తలలోకి బాణాసంచా దూసుకుపోయింది. దీంతో ఆయన సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో న్యూ ఇయర్ వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడు స్టీల్ ప్లాంటులో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నట్లు తెలిసింది.
Breaking news: మంటల్లో దివాకర్ ట్రావెల్ బస్సు