Home Page SliderNational

భారత ఆటగాళ్ల తీరుపై హెడ్ కోచ్ తీవ్ర అసంతృప్తి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో టీమిండియా ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే జట్టులో సీనియర్ ఆటగాళ్ల తీరుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఐదో రోజు ఆట ముగిసిన వెంటనే భారత డ్రెస్సింగ్ రూంలో సెలెక్టర్ల కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు తలెత్తినట్లుగా సమాచారం. అందుకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. డ్రెస్సింగ్ రూంలో జరిగిన డిస్కషన్ లీక్ అవడంపై తాజాగా కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. సిరీస్ గురించే తాము చర్చించామని, తాను ఒక వ్యక్తి గురించి మాట్లాడటం అనేది ఉండదని తెలిపారు. డ్రెస్సింగ్ రూంలో నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నంతవరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుందని కామెంట్ చేశారు.