Andhra Pradesh

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు

•వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏనాటికీ ఓటమి లేదు
•అన్ని ఎన్నికల్లోనూ వైయస్సార్‌సీపీదే ఘన విజయం
•అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా జగన్‌ పరిపాలన
•వైఎస్ఆర్సిపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

ఏపీలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత కేక్‌ కట్‌ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజలతో మమేకం అవుతోందని అందుకే ప్రజలంతా తమ హృదయాల్లో పార్టీని పదిలపర్చుకున్నారని 12 ఏళ్లుగా వైయస్‌ జగన్‌ పార్టీని ఆదర్శంగా నడుపుతున్నారని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా పరిపాలిస్తున్నారని సీఎం వైయస్‌ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ అందుకు నిదర్శనమని… తండ్రి బాటలో నడుస్తున్న జగన్‌, ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలే లక్ష్యం, ప్రజలే గమ్యం పేదల అభివృద్ధే ప్రధాన ఆశయంగా సామాజిక సాధికారితే ఎజెండాగా సీఎం ముందుకు వెళ్తున్నారని, 75 ఏళ్లుగా నినాదాలకే పరిమితమైన అనేక అంశాలను ఆయన ఆచరణలోకి తీసుకొచ్చారని అన్నారు.

ఎన్నికల హామీల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తామని చెప్పి, అందులో చెప్పిన ప్రతి మాటను అమలు చేశారని అలా జగన్‌ చరిత్రలో నిల్చిపోయారని గత ఎన్నికల్లో 151 స్దానాల్లో గెలిపించిన ప్రజలు, తమపై అచంచల విశ్వాసాన్ని చూపితే.. దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, తాము సరైన పార్టీకి, సరైన నాయకుడుకి పాలనా పగ్గాలు అప్పగించామని ప్రజలు గర్వపడేలా సీఎం పని చేస్తున్నారని అన్నారు. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం.. వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇస్తూ ఏకంగా చట్టం చేయడం నిజంగా ఒక గొప్ప నిర్ణయంమని అది మామూలు విషయం కాదని గతంలో ఏ ప్రభుత్వం కూడా అలా చేయడానికి సాహసించ లేదని అన్నారు.అలాగే మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 70 శాతం పదవులు ఇవ్వడం దేశంలో ఎక్కడా జరగలేదని అది కేవలం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమైందని ఇన్ని మంచి పనులతో సీఎం వైయస్‌ జగన్, వైయస్సార్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్త గర్వంగా కాలర్‌ ఎగరేసుకునేలా చేశారని దీన్ని మేం గర్వంగా చెప్పుకోగలం అని వివరించారు.