రాష్ట్రప్రభుత్వ బిల్లులపై కరుణించిన గవర్నర్
ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వ బిల్లులపై గవర్నర్ తమిళిసై కరుణ చూపించారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న తెలంగాణా యూనివర్సిటీల బిల్లును ఈ నెల 15 లోగా క్లియర్ చేస్తారని రాజ్ భవన్ వర్గాలు చెప్పినట్లు సమాచారం. తమిళిసై తీరుపై కొంతకాలంగా గుస్సాగా ఉంది ప్రభుత్వం. బిల్లులు క్లియర్ చేయడం లేదంటూ గవర్నర్ తమిళిసై పై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. పైగా సుప్రీంలో కేసు కూడా వేసింది. గతంలో మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ బిల్లును,మున్సిపాలిటీ బిల్లును, ది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ బిల్లలు ఆమోదించిన గవర్నర్, తెలంగాణ్ మున్సిపల్ లాస్ బిల్లును, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీబిల్లులను పెండింగ్లో పెట్టారు. అయితే వీటి ఆమోదంపై నేడు క్లారిటీ దొరికింది. చివరికి ఈ బిల్లులను క్లియర్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

