Home Page SliderTelangana

గవర్నర్ దివ్యాంగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు

రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తిరిగి కారులో వెళుతూ సమీపంలో ఉన్న దివ్యాంగ యువకులను చూశారు. వెంటనే కారు దిగి వచ్చి వారిలో ఒకరైన భాస్కర్ నాయక్‌తో మాట్లాడుతూ వారిసమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజ్‌భవన్‌కు రమ్మని చెప్పి వెళ్లిపోయారు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ కోటా ఉద్యోగాల భర్తీకి విన్నవించగా.. వివరాలు తెలుసుకుని మాట్లాడేందుకు రాజ్‌భవన్‌కు రమ్మని చెప్పారని భాస్కర్‌నాయక్ తెలిపారు. గవర్నర్‌తో దివ్యాంగ యువకులు హనుమాన్‌నాయక్, సైదులు తదితరులు మాట్లాడారు.