వైసీపీ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది: వైసీపీ ఎంపీ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశరాజధాని ఢిల్లీలో 30 పార్టీలతో NDA సమావేశం,24 పార్టీలతో బెంగుళూరులో విపక్షాల భేటి జరుగుతున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ మద్దతుతోనే కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా అధికారం చేపడుతుంది. కాగా అది రాష్ట్ర ప్రజల దీవెనలు,ఓట్ల ఆశీర్వాదం ద్వారానే సాధ్యమవుతుంది. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్ని జాతీయ మీడియా సర్వేల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని రిపోర్టులు వచ్చాయి అని ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త దేశరాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.