బంగ్లాదేశ్‌లో హిందువుల ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తా..!?
బంగ్లాదేశ్‌లోని హిందువులకు రక్షణ కల్పిస్తామని ప్రధాని మోదీకి తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారు. ముహమ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసి, భద్రతపై హామీ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా తెలిపారు. ఆ దేశంలో నివసిస్తున్న హిందువులు, మైనారిటీలందరికీ భద్రత కల్పించడంతోపాటు, వారి హక్కులు పరిరక్షిస్తామని బంగ్లాదేశ్ హామీ ఇచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే హిందువులపై దాడులు జరగడంతో దేశ వ్యాప్తంగా బంగ్లాలో జరుగుతున్న పరిణామాలపై అలజడి నెలకొంది. ఈ సందర్భంగా నోబుల్ గ్రహీత అయిన యూనస్, తమ ప్రభుత్వం మైనార్టీల హక్కులను పరిరక్షిస్తుందని పేర్కన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారతదేశ మద్దతును పునరుద్ఘాటించారు.

