రూ.40 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం కసరత్తు
టిజి: రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రుణమాఫీకి రు.31 వేల కోట్లు, రైతు భరోసా (ఎకరానికి రూ.7500) కు రూ.5 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.1500 కోట్లు అవసరం అవుతాయి. బాండ్లు, ప్రభుత్వ భూముల తాకట్టు, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేని ద్వారా ఎంత వరకూ వస్తాయనేది స్పష్టత వస్తే, మిగతాది సమీకరించనుంది.