Home Page SliderTelangana

ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టిన సర్కారు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో నగర యంత్రాంగం ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది. మూడు కమిషనరేట్ల పరిధిలో 127 కూడళ్ల విస్తరణకు జీహెచ్‌ఎంసి ఆమోదం తెలిపింది. అయితే బల్దియా వద్ద నిధుల్లేవు. సర్కారు నుంచి విడుదల అవడం లేదు. నిధుల సమస్యను తీర్చి, ట్రాఫిక్ సమస్యపై అధ్యయనం చేయించి, నిర్మాణ అనుమతులపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.