Home Page SliderNational

జీఎస్టీ తగ్గనున్న వస్తువులివే..

జీఎస్టీ తగ్గనున్న వస్తువులివే..

మంగళవారం దిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని రకాల వస్తు సేవలపై జీఎస్టీ పన్ను తగ్గించడంతో వాటి ధరుల తగ్గనున్నాయి. వీటిలో క్యాన్సర్ మందులు , జరీదారం, సినిమాహాళ్లలో తినుబండారాలు వంటివి ఉన్నాయి.

క్యాన్సర్ మందులకు జీఎస్టీ ఇప్పటివరకూ  12శాతం ఉండగా, ఇప్పుడు పూర్తిగా పన్ను తొలగించారు.

వండని తినుబండారాలు, స్నాక్స్, చేపల నుండి తయారు చేసిన ప్రోటీన్ పేస్ట్‌పై 18 శాతం నుండి, 5 శాతానికి తగ్గించారు.

ఇమిటేషన్ జరీదారంపై 12శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. ఇక సినిమా హాళ్లలో తినుబండారాలను 18 శాతం నుండి 5 శాతానికి పన్ను తగ్గించారు.