తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చడమే లక్ష్యం
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చడమే లక్ష్యమన్నారు ఎక్సైజ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ధూల్ పేట్ ను 95 శాతం గంజాయి రహిత ప్రాంతంగా మార్చామని పేర్కొన్నారు. గత నెల రోజుల నుంచి మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్స్ పై దృష్టి పెట్టామని తెలిపారు. రత్నాబాయి అనే మహారాష్ట్ర స్మగలర్ గంజాయి స్మగ్లింగ్ లో కీలకంగా వ్యవహారిస్తున్నట్టు గుర్తించి ఆ గ్యాంగ్ పై నిఘా పెంచామని చెప్పారు. మేడ్చల్ ప్రాంతంలో చేసిన తనిఖీల్లో రూ.కోటి విలువ చేసే 410 కేజీల గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేశామన్నారు కమలాసన్ రెడ్డి.


 
							 
							