Home Page SliderNational

చేయి కోసుకున్న ప్రియురాలు.. గుండె ఆగి చనిపోయిన ప్రియుడు

మనస్తాపంతో ప్రియురాలు చేయి కోసుకుంది. ఆ స్థితిలో ఆమెను చూసిన ప్రియుడు తట్టుకోలేక గుండె ఆగి చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని జగత్ పురి ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రియురాలు లా చదువుతుండగా, ప్రియుడు చదువు పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇటీవల వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అవి కాస్తా అపార్థాలుగా మారడంతో యువతి తట్టుకోలేకపోయింది. పదునైన కత్తితో మణికట్టు నరాలు కోసుకుని, ఆ వీడియోను ప్రియుడు అరుణ్ నందాకు పంపింది. ఆ వీడియోను చూసిన అరుణ్ వెంటనే ఆమె వద్దకు చేరి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితిని చూసిన అరుణ్ స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే అతడు మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏ కారణంతో మరణించాడు పోస్టుమార్టం లో తేలనుంది. అయితే.. చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.