Home Page SliderNational

ట్రైనీ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరగలేదు..

కోల్ కతా ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారం కేసులో సీబీఐ సంచలన విషయం వెల్లడించింది. హత్యాచార ఘటనలో గ్యాంగ్ రేప్ జరిగిన దాఖలాలు లేవని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆ వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ గతంలో జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని తమ విచారణలో సీబీఐ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారించినట్లు పేర్కొన్నాయి. అలాగే దర్యాప్తు తుదిదశకు చేరుకుందని, త్వరలో కోర్టులో అభియోగాలు దాఖలు చేయనుందని తెలిపాయి.