NationalNews

8నెలల పాటు దర్జాగా నకిలీ పోలీస్ స్టేషన్ నడిపిన గ్యాంగ్

బీహార్: నకిలీ పోలీసులు , నకిలీ సినిమాలు సినిమా ప్రపంచంలో తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ చూసుండం. సినిమాలో నకిలీ ఆసుపత్రి పెట్టి డాక్టర్ ట్రీట్‌మెంట్ ఇచ్చినట్టు , నకిలీ వేషంలో పోలీసుల లాగా డ్యూటి చేయడం చూసుంటాం. కానీ నిజ జీవితంలో ఈ తరహా ఘటనలు జరుగుతాయని ఎవ్వరు ఊహించి ఉండరు. కానీ ఇటువంటి తరహా కేసు ఒకటి బీహర్‌లో చోటు చేసుకుంది. బిహార్‌లోని బాంకా జిల్లాలో భోళా యాదవ్ అనే వ్యక్తి తన గెస్ట్ హౌస్‌లో ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరి వద్ద డబ్బులు వసూలు చేశాడు. వారికి యూనిఫార్మ్ ఇచ్చి పనిలో పెట్టుకున్నాడు. వారంత తాము నిజంగా ఉద్యోగం చేస్తున్నామనుకున్నారు. అంతేకాకుండా కొంత డబ్బులు ఇచ్చి అనిత , జూలీ అనే ఇద్దరు మహిళలను పోలీసులుగా నియమించుకున్నాడు.

మరో ముగ్గురిని ఈ ముఠాలో కలుపుకొని వారికి డీఎస్పీ , స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ హోదాలు కట్టబెట్టి , నకిలీ తుపాకులు ఇచ్చి ఎన్నో దందాలు చెయించాడు. 8నెలలు దీని గురించి ఎవ్వరికి అనుమానం రాకుండా ఎంతో మంది వద్ద నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఇదిలా ఉండగా నిజమైన పోలీస్ స్టేషన్ నకిలీ పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్ల దూరం ఉండండం గమనార్హం. ఈ క్రమంలో టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన శంభు యాదవ్ నాటు తుపాకులతో ఉన్న పోలీసులను చూసి అనుమానం వచ్చి ఆరా తీయగా ఈ నకిలీ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని , అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చెేపట్టారు . 8నెలలుగా ఈ దందా జరుగుతున్న ఎవరు గుర్తించక పోవడంతో ఈ కేసు అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.