Home Page SliderNationalSports

కాబోయే టీమిండియా కెప్టెన్ ఇతడేనా?

భారత క్రికెట్ టీమ్‌కు ఇప్పుడు బలమైన సారథి అవసరం ఎంతైనా ఉంది. రోహిత్ శర్మ రిటైర్ అవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి అతని వారసుడిగా బీసీసీఐ యువ ఓపెనర్‌ను కెప్టెన్‌గా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ తర్వాత యశస్వి జైస్వాల్‌ను కెప్టెన్‌గా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట బుమ్రాను కెప్టెన్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఫిట్‌నెస్ సమస్యలు, పనిభారం కారణంగా కెప్టెన్సీ తీసుకునే పరిస్థితుల్లో లేడు. యశస్వి ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కూడా రోహిత్ అందుబాటులో లేనప్పుడు తొలి మ్యాచ్‌కు నాయకత్వం వహించి జట్టుకు విజయాన్నందించారు. యశస్వి జైస్వాల్‌కి కేవలం 23 ఏళ్లు కావడం కూడా కలిసివస్తోంది. తక్కువ వయసులోనే దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ కూడా 22 ఏళ్లకే కెప్టెన్‌గా రాణించాడు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా 25 ఏళ్ల వయసులోనే స్టీవ్‌స్మిత్ కెప్టెన్‌గా మంచి ఫలితాలు సాధించాడు. భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా 25 ఏళ్లకే కెప్టెన్ అయ్యారు. అయితే అప్పటికే కోహ్లి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్‌గా పేరు పొందారు.  దీనితో అభిమానులు యశస్విని కెప్టెన్ చేయాలని కోరుతున్నారు.