పిల్లల మర్రికి పూర్వ వైభవం
టిజి: మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి చెట్టుకు పూర్వస్థితి తిరిగొచ్చేలా అటవీశాఖ చేసిన కృషి ఫలించింది. 700 ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చెట్టు మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటోంది. నాడు 60 శాతం వరకు ఎండిపోయి నిలువ నీడనిచ్చే పరిస్థితి లేకుండా పోయిన మహావృక్షం ప్రస్తుతం 90 శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ పచ్చదనంతో కనులకు విందు చేస్తోంది. 2017 డిసెంబర్ తర్వాత మళ్లీ ఈ వారంలో పర్యాటకులను అనుమతించనున్నారు.

