Andhra PradeshHome Page Slider

“వైసీపీ హయాంలో పంచభూతాలను మింగేశారు”:సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాష్ట్రంలో భూముల ఆక్రమణ,సహజ వనరుల దుర్వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించారు. కాగా గత 5 ఏళ్లల్లో వైసీపీ హయాంలో పంచభూతాలను మింగేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అండతో రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లు చెలరేగిపోయారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు చెట్లు నరికి చైనాకు స్మగ్లింగ్ చేశారని సీఎం ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండలో రూ.500కోట్లతో ప్యాలెస్ కట్టిందన్నారు. అంతేకాకుండా అమరావతిలో రోడ్డుపై ఉన్న మట్టిని సైతం తవ్వుకుని పోయారన్నారు. మరోవైపు గనుల దోపిడీ కోసం అధికారులను బెదిరించి..బదిలీ చేశారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో దోపిడీలకు పాల్పడిన నేరస్థులను వదిలిపెట్టమని సీఎం హెచ్చరించారు.