Home Page SliderNational

అయోధ్యలో ల్యాండ్ అయిన మొదటి విమానం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటయ్యింది. దీనిలో నేడు తొలిసారి విమానం ల్యాండయ్యింది. ఈవిషయంపై పౌరవిమానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ అంకిత భావానికి నిదర్శనం ఇదేనన్నారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో తొలి విమానం ల్యాండ్ అయ్యిందన్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వం పట్ల ప్రభుత్వ నిబద్ధత, చిత్తశుద్ది కనిపిస్తోందన్నారు. అయోధ్యను ప్రపంచ ప్రసిద్ధి ఆధ్యాత్మిక కేంద్రంగా మలిచారని పేర్కొన్నారు.

రూ. 350 కోట్లతో ‘మర్యాద పురుషోత్తమరామ’ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూపొందించరు. గతంలో అయోధ్యలో ఉన్న 178 ఎకరాల స్థలంలో ఉన్న చిన్న ఎయిర్ స్ట్రిప్‌ను నేడు అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఈ విమానాశ్రయాన్ని ఈ నెల 30న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభిస్తారని సింధియా పేర్కొన్నారు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చే రామ భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగకరం అన్నారు. గంటకు రెండు,మూడు విమానాలను ఈ విమానాశ్రయం హ్యాండిల్ చేయగలదన్నారు. ప్రస్తుతానికి 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులోకి వచ్చిందని, 2,200 మీటర్ల రన్‌వే అందుబాటులో ఉందన్నారు. త్వరలో దీనిని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నేడు ట్రైయల్ రన్ నిర్వహించారు.