స్కూల్ బస్సులో మంటలు.. ప్రాణాలను కాపాడిన డ్రైవర్
చిల్డ్రన్స్ డే రోజున ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో పిల్లలతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 15 మంది పిల్లలు ఉన్నారు. ఇంజిన్ నుండి పొగలు రావడాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్.. హుహుటీన పిల్లలందరినీ అప్రమత్తం చేసి వారి ప్రాణాలు కాపాడాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ఉన్న పిల్లల్లో చాలా వరకూ ఆరు నుంచి ఎనిమిదేళ్లలోపు వారే. నేడు బాలల దినోత్సవం నేపథ్యంలో పిల్లలు వివిధ గెటప్ లో ముస్తాబై స్కూల్ కు వెళ్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది.

