Home Page SliderTelangana

‘సిట్’ విచారణలో వెలికివస్తున్న నిజాలు

TSPSC పరీక్ష పేపర్ లీజేజ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇద్దరితో మొదలైన అనుమానితుల జాబితా ‘ఇంతితై వటుడింతై’ అన్నట్లు పెరిగిపోతోంది. 42 మంది ఉద్యోగులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సిట్. ప్రధాన నిందితులుగా ముగ్గురిని ఇప్పటికే గుర్తించింది. వారితో దగ్గరగా మెలిగే మరికొంతమందిని విచారిస్తోంది. కాగా నేడు కొత్తవిషయం వెలుగులోకి వచ్చింది. 26 మంది TSPSC ఉద్యోగులు ఈ సంస్థ నుండి NOC తీసుకోకుండానే పరీక్ష రాసినట్లు గుర్తించారు.  ఈ సంస్థలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా రాజీనామా చేయకుండానే ఈ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీనితో కంగుతిన్న సిట్ మరింత లోతుగా దర్యాప్తును కొనసాగిస్తోంది.