గన్‌మెన్లను సరెండర్ చేసిన మాజీమంత్రి..కావాలంటే అరెస్టు చేసుకోండి
తన గన్‌మెన్లపై ల్యాండ్ మాఫియా ఆరోపణలు రావడంతో వారిని డీజీపీకి సరెండర్ చేశారు వైసీపీ నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఒంగోలులోని నకిలీ రిజిస్ట్రేషన్ల దందా బయటపడింది. ఈ విషయంలో టీడీపీ నేతలు వైసీపీకి చెందిన బాలినేనికి సన్నిహితులు ఉన్నారని వారిని విచారిస్తే నిజం బయటపడుతుందని ఆరోపణలు చేశారు. ఖాళీ స్టాంపు పేపర్లు, నకిలీ డాక్యుమెంట్లతో భూములను ఆక్రమించే ఈ ముఠాతో వైసీపీ నేతలకు సంబంధం ఉందంటూ ప్రతిపక్షం వాదిస్తోంది. దీనితో టీడీపీ వారితో నేను మాటలు పడాలా అంటూ మండిపడ్డ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తన గన్‌మెన్లను సరెండర్ చేశారు. అంతేకాదు విచారణ జరిపి కావాలంటే అరెస్టు చేసుకోండి అంటూ వ్యాఖ్యానించారు. ఈ దందాలో ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉన్నా వారిని వదలొద్దంటూ పోలీసులకు సలహా ఇచ్చారు. వైసీపీ నేతలను, నాయకులను కూడా విచారించాలంటూ సవాల్ విసిరారు.

