ఒలంపిక్ అథ్లెట్‌ను పెట్రోల్ పోసి చంపిన మాజీ ప్రియుడు
ఉగాండా మారథాన్ రన్నర్ రెబక్కా చెప్టెగీ, మారథాన్ ప్రియులకు సుపరిచితమే. ఈమె పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఈమెని తన మాజీ ప్రియుడు నిప్పు అంటించాడు. కారణాలు తెలియాల్సి ఉంది. ఈ దారుణంలో రెబక్కా శరీరం 75 శాతానికి పైగా కాలిపోయింది. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన తుది శ్వాస విడిచారు. ఆ దేశ ఒలంపిక్ కమిటీ చీఫ్ అయిన డొనాల్డ్ రుకారే మాట్లాడుతూ మేము ఒక గొప్ప అథ్లెట్ ను కోల్పోయాము. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.