ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది.. ఓటమిని అంగీకరించం..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తీర్పును తాము అంగీకరించబోమని కాంగ్రెస్ ప్రకటించింది. రిజల్ట్స్ తమను షాక్ కు గురి చేశాయని చెప్పింది. ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. ఉదయం నుంచే రిజల్ట్స్ ప్రకటించడంలో ఈసీ అధికారులు తీవ్ర జాప్యం చేశారని ఆరోపించింది. ఈ మేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ లేఖ రాసింది. ఉదయం 9 నుంచి 11గంటల మధ్య ఈసీ వెబ్ సైట్ లో ఫలితాల అప్డేట్ లేదని తెలిపింది. ఫలితాల వెల్లడి మందకొడిగా సాగిందని లేఖలో పేర్కొన్నది. వెబ్ సైట్ ను వాస్తవమైన, కచ్చితమైన గణాంకాలతో అప్డేట్ చేయాలంటూ తమ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది.

