Home Page SliderTelangana

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

దుబ్బాక: తెలంగాణ ప్రజలను నమ్మించి లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి ఓటుతో బుద్ది చెప్పి ఇంటికి సాగనంపాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. గురువారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ వాళ్లను లుచ్చాగాళ్లు అని దూషించారు.. మరి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన కేసీఆర్, కేటీఆర్ లుచ్చాగాళ్లు కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ బిడ్డ కవిత.. ఢిల్లీలో లిక్కర్ల దందా పెట్టుకుందన్నారు. బీఆర్ఎస్ మోసాలను ప్రజలు నమ్మకుండా ఓటుతోనే గుణపాఠం చెప్పాలన్నారు. కరోనా కాలంలో 6 కిలోల బియ్యం, టీకాలు అందించిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ప్రజలారా బీజేపీ కమలం గుర్తుపై ఓటు వేసి మాపార్టీని గెలిపిచాలని ప్రార్థన.