Home Page SliderInternationalSports

ఆఫ్గానిస్థాన్ మహిళా క్రికెటర్ల భావోద్వేగం..

మహిళలపై ఎన్నో ఆంక్షలు, ఆదేశాలు అమలవుతున్న తాలిబన్ల రాజ్యం ఆఫ్గానిస్తాన్ నుండి మహిళల క్రికెట్ టీమ్ ధైర్యంగా ముందుకొచ్చింది. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ మైదానంలో క్రికెట్ వితౌట్ బోర్డర్స్ ఎలెవెన్‌తో నేడు ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్ ఆడారు. క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ వితౌట్ బోర్డర్స్, ఆస్ట్రేలియా ప్రభుత్వం కలిసి ఈ మ్యాచ్‌ను నిర్వహించాయి.  ఈ సందర్భంగా వారు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆఫ్గనిస్తాన్ మహిళల క్రికెట్‌లో ఇది అద్భుత క్షణాలని పేర్కొన్నారు. ఆనాడు ప్రాణభయంతో దేశాన్ని విడిచిపెట్టాం. ఇన్నాళ్లకు కలిసాం అంటూ పేర్కొన్నారు.  2021లో తాలిబన్లు ఆఫ్గాన్‌ను ఆక్రమించాక, మహిళల క్రీడలు, చదువు వంటి అనేక విషయాలలో ఆంక్షలు విధించారు. దీనితో మహిళా క్రికెటర్లు దేశాన్ని విడిచి, ఆస్ట్రేలియాలో శరణార్థులుగా ఉన్నారు. దాదాపు అక్కడి ప్రభుత్వం చొరవతో జట్టుగా ఏర్పడి, ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు.