Home Page SliderNational

తల్లి కనిపించక బెంగగా గున్న ఏనుగు హల్‌చల్..

బిడ్డలు తల్లి కనిపించకపోతే ఎంత బెంగపడతారో..ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మనుషులే కాదు సృష్టిలోని ప్రతీ జీవి తల్లి కోసం ఆరాటపడుతుంది. కేరళలోని వయనాడ్‌లో కట్టికుళం సమీపంలో ఒక గున్న ఏనుగు పిల్ల ఇలాగే ఒంటరిగా సంచరిస్తూ రోడ్లపై కార్లకు, బస్సులకు అడ్డం పడుతోంది. మంద నుండి, తల్లి నుండి విడిపోయి బెంగపడుతోంది. దీనితో కొందరు ప్రయాణికులు అటవీశాఖకు సమాచారం అందించారు. అధికారులు గున్న ఏనుగును సంరక్షించి, ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాని తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.