భూకంపంలో నిండు చూలాలు..ఏం చేసిందంటే..
థాయ్‌లాండ్, మయన్మార్‌లను శుక్రవారం కుదిపేసిన భూకంపాలు ఎన్నో ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకా వెయ్యిమందికి పైగా మృతి చెందారని సమాచారం. ఈ భూకంపంలో బ్యాంకాక్‌లో 1000 పడకల ఆసుపత్రి కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రిలో అనేకమంది చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా భూకంపం వచ్చి భవనం భూప్రకంపనలతో వణికిపోతోంది. ఈ సమయంలో ఒక నిండు చూలాలు పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆ సమయంలో హాస్పటల్‌లో అందరూ దిక్కుతోచక పరిగెడుతున్నారు. అయితే మానవత్వం ఇంకా నిలిచి ఉందని ఇలాంటి సంఘటనలే నిరూపిస్తాయి. భూకంపం కారణంగా శరవేగంతో రోగులను ఖాళీ చేయిస్తున్నారు. ఈ మహిళను కూడా స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్‌లోనే ఆసుపత్రి సిబ్బంది డెలివరీ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యులు ఆ పార్కులోనే ఇతర అత్యవసర సేవలందించాల్సిన రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు.