BusinessInternationalNews

ఇక డాలర్ ఆటలు చెల్లు..కొత్త బ్రిక్స్ కరెన్సీ వచ్చేస్తోంది

రష్యాలో కజన్ వేదికగా జరుగుతున్న 16వ బ్రిక్స్ సదస్సులో పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు పాల్గొన్నారు. వీరిలో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఉన్నారు. దీనిలో BRICS అధికారిక కరెన్సీ నమూనా నోట్లను రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అందరికీ చూపించారు. వీటి చలామణీ జరిగితే అమెరికన్ డాలర్ ఆటలకు చెల్లుపడినట్లే. ఎందుకంటే ఈ కరెన్సీ పలు దేశాలలో సులభంగా చెలామణీ అవుతుంది. ఈ నమూనాలో భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికా వంటి దేశాల జాతీయ పతాకాలు ఉన్నాయి. మన దేశంలోని తాజ్‌మహల్, చైనా డ్రాగన్ వంటి చిహ్నాలున్నాయి. కరెన్సీ వెనుకవైపు కొత్త సభ్య దేశాల పేర్లు, జెండాలు కూడా ఉన్నాయి.