కిడ్నీలు దెబ్బతినడంతో కృష్ణంరాజు ఆరోగ్యం విషమించిందన్న వైద్యులు
కృష్ణంరాజు మరణానికి సంబంధించిన కారణాలను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వివరించాయి. ఆయన షుగర్ వ్యాధితోపాటు, పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో కొంత కాలంగా ఆయన ఇబ్బందుపడుతుండగా… అకస్మాత్తుగా తీవ్రమైన కార్డియాక్ అరెస్టుతో ఆయన చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. గుండె కొట్టుకునే విషయంలో కొంత కాలంగా ఆయనకు సమస్యలున్నాయి. రక్తప్రసరణకు సరిగా లేనందు వల్ల ఆయన సతమతమయ్యారు. గత ఏడాది ఆయన కాలికి ఆపరేషన్ నిర్వహించారు. వీటితోపాటు దీర్ఘకాలంగా ఆయన కిడ్నీలు, లంగ్స్ సమస్యలు ఆయనను ఇబ్బంది పెట్టాయి. పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టుగా ఏఐజీ వర్గాలు పేర్కొన్నాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో ఆస్పత్రిలో చేరిన క్షణం నుంచి ఆయనను వెంటిలేటర్ పై ఉంచే చికిత్స చేసినట్టుగా వైద్యులు తెలిపారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన చనిపోయినట్టు తెలిపారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన పార్ధవదేహానికి నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అంత్యత్రియలు నిర్వహిస్తారు.
