Home Page SliderInternational

ఎనిమిదేళ్ల బాలునికి బౌద్ధమతంలో మూడో అత్యున్నత కీలక పదవి

అమెరికాలో జన్మించిన మంగోలియన్ చిన్నారికి కీలక పదవి
బౌద్ధమతంలో మూడో అత్యున్నత నాయకుడిగా గుర్తింపు
ధర్మశాలలో ఇటీవల పట్టాభిషేక కార్యక్రమం
అనుకూల లామాకు కీలక పదవి కట్టబెట్టిన డ్రాగన్

అమెరికాలో పుట్టిన మంగోలియ బాలుడిని 10వ ఖల్ఖా జెట్సన్ దంపా రిన్‌పోచేగా దలైలామా ప్రకటించారు. టిబెటన్ బౌద్ధమతంలో మూడో అత్యున్నత ర్యాంక్‌ అందించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మార్చి 8న జరిగిన వేడుకలో ఎనిమిదేళ్ల బాలుడితో దలైలామా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాలో ఎనిదేళ్ల చిన్నారికి కవల సోదరుడు ఉన్నాడు. ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కుమారుడు, మాజీ మంగోలియన్ పార్లమెంటు సభ్యుని మనవడు. ఎనిమిదేళ్ల చిన్నారిని టిబెటన్ బౌద్ధమతంలో మూడో అత్యున్నత లామాగా అభిషేకించే చర్య చైనాకు కోపం తెప్పించే అవకాశం ఉంది. చైనా ప్రభుత్వం ఎంపిక చేసిన బౌద్ధ నాయకులను మాత్రమే గుర్తిస్తామంటోంది. ఈ చర్యపై చైనా అసంతృప్తి ముప్పు ఉందని భావించిన దలైలామా… వేడుకసమయంలో ఉద్విగ్నానికి గురయ్యారు. ఓవైపు ఉత్సాహం వెల్లివిరిస్తున్నా… భయాందోళనలు వ్యక్తమయ్యాయి. 1995లో, దలైలామా 11వ పంచేమ్ లామా అని పేరు పెట్టినప్పుడు, చైనా అధికారులు కుటుంబాన్ని కిడ్నాప్ చేసారు. నాటి నుంచి వారిని ఆయన నేటి వరకు చూడలేదు లేదా వినలేదు. టిబెటన్ బౌద్ధమతంలో రెండో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక నాయకుడైన పంచేమ్ లామా స్థానంలో చైనా తన సొంత మనిషిని నియమించింది.