Home Page SliderInternational

చేసిన పనికి బాలుడికి, తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన దలైలామా

భౌద్ధులకు, భౌద్ధ భిక్షువులకు గొప్పఆధ్యాత్మిక గురువైన దలైలామా ఒక బాలునికి, అతని తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఒక బాలుని పెదవులపై ముద్దు పెట్టడమే కాకుండా, నాలుకను చప్పరించమంటూ దలైలామా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనమయ్యాయి. భౌద్ధులు భగవంతునితో సమానంగా గౌరవించే గురువు స్థానంలో ఉండి ఇలాంటి పనులు చేసినందుకు సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. అతని వద్ద ఆశీర్వాదం ఆశించి వచ్చిన బాలుడిని కౌగలించుకున్న ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది. దీనితో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. దీనితో అతడు దిగివచ్చి బాలునికి, అతని తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఇతను ఇంత ఛీప్‌గా ప్రవర్తించడం నెటిజన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ విషయంలో అతని ఫాలోయర్స్ అతన్ని సమర్థిస్తున్నారు. నిర్మల హృదయం గల పసి పిల్లలతో ఆయన ఆటలాడే తత్వంతో అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తారని, దీనిని తప్పుగా అనుకోకూడదని అంటున్నారు. 2019లో కూడా ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడి ఇరుక్కున్నారీయన. ఒక బిబిసి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో దలైలామా మహిళ అయి ఉంటే ఆమె ఆకర్షనీయంగా ఉండాలంటూ మాట్లాడారు. గత నెలలో అమెరికాలో పుట్టిన మంగోలియా బాలుడిని మూడవ అత్యధిక టిబెటన్ గురువుగా నియమించాడు. దలైలామా టిబెట్‌లో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తోందని చైనా ఆరోపిస్తోంది.