Home Page SliderNational

దేశంలో ఉచితాల సంస్కృతి పోవాలి: మోదీ

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎందుకంటే వచ్చే నెలలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికార,ప్రతిపక్షాల నేతలు ఎన్నికల ప్రచారాలలో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన బీజేపీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తుంది. కాగా ఈ ఎన్నికల ప్రచారాలలో బీజేపీ ముఖ్యనేతలు పాల్గొంటున్నారు. అయితే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్చువల్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కర్ణాటకలోని బీజేపీ శ్రేణులతో మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ మాట్లాడుతూ.. ఉచిత పంపిణీలకు రాష్ట్రాలలో ముగింపు పలకాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి వారంటీ ముగిసిందన్నారు. ఆ పార్టీ ఇచ్చే హామీలకు అర్థం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రాలలో అమలు చేసే ఉచిత పంపిణీల కారణంగానే రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయన్నారు. కాగా ఇలాంటి ఉచిత పథకాల వల్ల దేశంలోని రాష్ట్రాలు ఎప్పటికీ అభివృద్ధి చెందలేవని మోదీ స్పష్టం చేశారు.