తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. సోమవారం 65,604 మంది స్వామి వారిని దర్శించుకోగా 24,266 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శనివారం నాడు స్వామి వారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టగా.. ఇప్పుడు కేవలం 6 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.96 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

