ఎంపీని తన్నిన కాకి..ఫోటోలు వైరల్
మన అందరికీ అబద్దమాడితే కాకి తన్నుతుందనే సామెత గుర్తుండే ఉంటుంది. అయితే మన పెద్దలు చమత్కారంగా అనే ఈ సామెత నిజమైతే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. కాగా ఈ సామెతకు అనుగుణంగానే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు వింత అనుభవం ఎందురైంది. ఆయన పార్లమెంటు ఆవరణలో ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటు వెళ్తున్నారు. ఈ సందర్భంలో ఓ కాకి ఆయన తలను తాకుతూ వెళ్లింది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఇది చూసిన బీజేపీ పార్టీ నేతలు,నెటిజన్లు అబద్దమాడితే ఇలాగే జరుగుతుందని సెటైర్లు వేస్తున్నారు.