జానీమాస్టర్‌కు రిమాండ్
తనవద్ద పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగికదాడి, అత్యాచారం కేసులో జానీమాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీనితో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడిని గురువారం గోవాలో అరెస్టు చేశారు. జానీ మాస్టర్‌ను రహస్యంగా విచారించిన పోలీసులు పలు కీలక అంశాలపై ఆరా తీశారు. హైదర్‌గూడలోని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని చెప్పడంతో పోక్సో కేసు కూడా నమోదు చేశారు.