బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలి:మమతా బెనర్జీ
బెంగుళూరులో రెండో రోజు విపక్షాల భేటి కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ..బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని వ్యాఖ్యానించారు. దేశంలోన్ విపక్ష పార్టీలన్నీ కలిసి INDIA కూటమిగా ఏర్పాడ్డామన్నారు. అయితే NDA,బీజేపీ నేతలు కలిసి INDIAను ఛాలెంజ్ చేయగలరా అని మమతా సవాల్ విసిరారు. కాగా మేము రైతుల,విద్యార్థులు ,దళితులు తరుపున ఈ దేశం కోసం కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో INDIA తప్పకుండా గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక దేశంలో INDIA గెలిస్తే.. దేశం గెలిచినట్లే అన్నారు. మరి ఈ దేశం గెలిస్తే.. బీజేపీ ఓడినట్లే కదా అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.

