స్కూటీని ఢీకొట్టిన కంటెయినర్
సంగారెడ్డి జిల్లా ముత్తంగి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్కూటీపై వెళ్తున్న ఒక మహిళ,ఒక యువకుణ్ణి వెనుక నుంచి వస్తున్న కంటెయినర్ అదుపు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ పై నుంచి కిందపడిన ఇద్దిరిపై నుంచి లారీ దూసుకెళ్లింది. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డి పేటకు చెందిన నాగశ్యామల(26) , తన బంధువుల అబ్బాయి గణేష్(17) ని ఇంటి వద్ద దించిరావడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగి చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు.