ఖైదీకి కూడా ఓటేసే అవకాశం కల్పించిన రాజ్యాంగం
మోత్కూరు: జైల్లో ఉన్న ఖైదీలు కూడా ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన భారత పౌరులందరికీ ఓటుహక్కు ఉంటుంది. తెలిసో తెలియకో తప్పులు చేసి జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. ఈ విషయం తెలియక చాలామంది ఖైదీలు ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. వివిధ నేరాల్లో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ప్రివెంట్యూడిటర్మినేషన్ పద్ధతిలో ఓటు వేయవచ్చు. నియోజకవర్గం పేరును సూచిస్తూ తాము ఓటర్లమని పోలింగ్ బూత్, ఓటరు క్రమ సంఖ్యతో దరఖాస్తు చేసుకుంటూ ఓటేసుకునే అవకాశం కల్పించాలని రాత పూర్వకంగా జైలర్‌కు వినతి పత్రం పెట్టుకోవాలి. ఖైదీలు సూచించిన ప్రాంతాల నుండి పోస్టల్ బ్యాలెట్లను తెప్పించి జైలు నుండే ఓటేసే అవకాశాన్ని అధికారులు కల్పిస్తారు.