‘కంపెనీయే బాధితులకు పరిహారం చెల్లిస్తుంది’..చంద్రబాబు
అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీయే బాధితులకు పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. రెడ్ కేటగిరీ పరిశ్రమలన్నీ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు. ఈ కంపెనీ యాజమాన్యం ఇంకా ప్రభుత్వానికి అందుబాటులోకి రాలేదన్నారు. పరిశ్రమల అనుబంధ శాఖలన్నీ ఒక ప్రణాళికతో పనిచేయాలన్నారు. ఓనర్ షిప్‌లో సమస్యలు కూడా ఈ ప్రమాదానికి కారణం అన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీని వేస్తామన్నారు.

