అడవిలో క్షుద్ర పూజల కలకలం..
మహబూబ్ నగర్ కేంద్రం అప్పనపల్లి శివారులోని అడవిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడి గింజలతో క్షుద్ర పూజలు చేశారు. అనంతరం క్షుద్ర పూజారి నాటు కోడిని కూడా బలి ఇచ్చారు. క్షుద్రపూజరి, మరో ఇద్దరు వ్యక్తులు అప్పనపల్లి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకొని క్షుద్ర పూజలను మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు వ్యక్తులను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.