Andhra PradeshHome Page Slider

కృష్ణానదిలో నాగప్రతిమల కలకలం

గుంటూరు, కృష్ణాజిల్లాలలో కృష్ణానది తీరంలో నాగ ప్రతిమలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ నాగ ప్రతిమలు కనిపిస్తున్నాయి. దీనితో ఇది చాలా పెద్ద తప్పంటూ స్థానికులు కలవరపడుతున్నారు. నాగప్రతిష్ట చేసిన విగ్రహాలు నదిలో ఎలా కనిపిస్తున్నాయంటూ ఆందోళనలు చెందుతున్నారు. ఇవి శిల్పులు చెక్కిన విగ్రహాలలో దోషపూరిత విగ్రహాలను ఇలా నదిలో వదిలేశారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పండితులు మాత్రం అది తప్పేం కాదని, దేవాలయాలలో తమ తమ కోరికలతో మొక్కుకుని నాగప్రతిష్ట చేసిన విగ్రహాలను జలాధివాసం చేయించవచ్చని పేర్కొంటున్నారు. వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ ఇలా మొక్కుకుని తమ కోరిక తీరాక దేవాలయంలో నాగప్రతిష్ట చేస్తారని, కొన్నాళ్లకు ఆ మండపాలు నిండిపోయాక వాటిని మంచి ముహూర్త కాలంలో నదిలో గాని, సముద్రంలో కాని నిమర్జనం చేస్తామని చెప్తున్నారు. ఇవి యంత్ర పూజితం కాదని, కేవలం భక్తులు ప్రతిష్టించిన విగ్రహాలు కావడంతో ఇలా చేయడం తప్పు కాదని తెలియజేస్తున్నారు.