అర్దరాత్రి క్షుద్రపూజల కలకలం
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అర్దరాత్రి క్షుద్రపూజలు కలకలం రేపింది. అయోధ్య నుండి వచ్చిన స్వామిజీ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పూజలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు. అదుపులోకి తీసుకున్నారు. ఆరేండ్ల బాలికను బలి ఇచ్చేందుకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు.

