సీఎంను త్వరలోనే ఫేక్ కేసులో అరెస్ట్ చేస్తారు
ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే ఓ ఫేక్ కేసులో అరెస్ట్ చేయబోతున్నారని కేజ్రీవాల్ తెలిపారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనలు చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ‘ఎక్స్’ ద్వారా విమర్శలు గుప్పించారు. ఆప్ ప్రభుత్వ ఎజెండాను పట్టాలు తప్పించేందుకు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయని చెప్పారు. “మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలపై గందరగోళం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఫేక్ కేసులో ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు. దానికంటే ముందు ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయి” అని కేజీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.