Home Page SliderNational

సీఎంకు హైకోర్టులో చుక్కెదురు..

కర్నాటక సీఎం సిద్ద రామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముడా స్కాంలో సీఎంను విచారించాలని గవర్నర్ థావర్ చాండ్ గెహ్లాట్ చేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ గెహ్లాట్ వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని జస్టిస్ నాగ ప్రసన్న తెలిపారు. అందుకే సీఎంను ప్రాసిక్యూటర్ చేయాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి లోపం లేదని హైకోర్టు తెలిపింది. న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సుమారు 14 సెట్లను అక్రమ రీతిలో సీఎం భార్యకు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.