రిజిస్ట్రేషన్ చేయించుకున్న సీఎం
కడపలో మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు మహనాడు ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మహనాడులో పాలుపంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈరోజు మహానాడులో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం ఉండనుంది. టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు.